పవన్ బాటలో విజయసాయిరెడ్డి..? హాట్ స్పాట్ గా వైజాగ్..!
ఏపీలో డిప్యూటీ సీఎం కమ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కూ, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కీ ఏదో తెలియని బంధం ఉంటుంది. అలాగని ఇద్దరూ ఎప్పుడూ కలిసినట్లు కానీ, మాట్లాడుకున్నట్లు కానీ కనిపించరు. కానీ పరస్పరం విమర్శలు కూడా చేసుకోరు. అలాగని పొగడ్తలూ ఉండవు. కానీ ఇద్దరి ప్రస్తావన ఉమ్మడిగా పలు చోట్ల వినిపిస్తూనే ఉంటుంది. ఏపీలో తాజాగా ఓ సమస్య మీద పవన్ కళ్యాణ్ స్పందించిన కొన్ని రోజుల్లోనే విజయసాయిరెడ్డి కూడా స్పందించారు.
తాజాగా గోదావరి జిల్లాల టూర్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత కాలుష్యం జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ అధికారుల్నీ, అలాగే సొంత పార్టీ మంత్రి దుర్గేష్ కూ చురకలు అంటించారు. ఆ తర్వాత కాలుష్యంపై ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రాష్ట్రంలో వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Development cannot come at the cost of public health. Recent reports show that air pollution levels in AP have been rising over the past three years, with Vizag emerging as a major pollution hotspot. As we pursue industrial growth, it is important to adopt cleaner technologies,…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 29, 2026
ప్రజారోగ్యానికి నష్టం కలిగించి అభివృద్ధి సాధించలేమని విజయసాయిరెడ్డి తెలిపారు.గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో వాయు కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని, విశాఖపట్నం ప్రధాన కాలుష్య కేంద్రంగా ఆవిర్భవించిందని ఇటీవలి నివేదికలు చూపిస్తున్నాయని సాయిరెడ్డి తెలిపారు. మనం పారిశ్రామిక వృద్ధిని సాధిస్తున్నప్పుడు, స్వచ్ఛమైన సాంకేతికతలను అవలంబించడం, భవిష్యత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణ చర్యలను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని సాయిరెడ్డి సూచించారు. అంతకు ముందు పవన్ నీటి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేయగా.. సాయిరెడ్డి గాలి కాలుష్యంపై ఈ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications