జార్ఖండ్‌లో రైలు హైజాక్
రాంచీ: జార్ఖండ్‌లోని మరోసారి మావోయిస్టులు పంజా విసిరారు. లతేహార్ జిల్లాలో హెహెగడ రైల్వేస్టేషన్ నుంచి ఓ ప్యాసింజర్ రైలును మావోయిస్టులు హైజాక్ చేశారు. అందులో మొత్తం 800 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం 100 మంది నక్సలైట్లు పాల్గొన్నారు. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ఇచ్చిన పిలుపును ప్రజలు పట్టించుకోకపోవడంతో ఈ చర్యలు పాల్పడ్డారు. బీహార్, జార్ఖండ్‌లో ఎన్నికలను బహిష్కరించాలని నక్సలైట్లు డిమాండ్ చేస్తున్నారు. రేపు జార్ఖండ్ లో రెండో దశ పోలింగ్ జరుగనుంది.
హెహె గడ స్టేషన్ లో రైలు ఆగి ఉండగా మావోయిస్టులు ఇంజిన్ డ్రైవర్లను బెదిరించి రైలును అధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడా ఆగకుండా నిదానంగా వెళ్ళవలసిందిగా తీవ్రవాదులు డ్రైవర్లను ఆదేశించినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications