న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితిలోనూ తాము కాంగ్రెసుకు మద్దతిచ్చే ప్రసక్తి లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ స్పష్టం చేశారు. తాము వామపక్షాలతో స్నేహానికి సిద్ధంగా ఉన్నామని ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎల్జెపి నేత రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. యుపిఎకు వామపక్షాల ఆశీస్సులు అవసరమని ఎన్సీపి నేత శరద్ పవార్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ కారత్ తమ వైఖరిని గురువారంనాడు స్పష్టం చేశారు.
తిరిగి అధికారంలోకి రావడానికి కాంగ్రెసుకు తాము సహకరించబోమని కారత్ చెప్పారు. కాంగ్రెసుతో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా లేమని, ఈ విషయాన్ని ఆ నేతలు గమనించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.