హైదరాబాదు: తొలివిడత ఎన్నికలు ముగిసిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర రెడ్డిని పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ సమర్థించారు. మహాకూటమి ద్వారా తెలంగాణ వస్తే హైదరాబాదులో ఆంధ్ర, రాయలసీమ ప్రజలు విదేశీయులవుతారని వైఎస్ చేసిన వాఖ్యలను డీఎస్ సమర్థించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో తప్పులేదని స్ఫష్టం చేశారు. ఇవాళ ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ విజయం ఖాయమని, మే 16 తర్వాత రాజకీయ పరిణామాలు మారతాయని ఆయనన్నారు.