విధుల నుంచి ఎస్పై దూరం
కడప : కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న రీపోలింగ్‌లో తెలుగుదేశం ఏజంట్లను బూత్‌లోపలకి రాకుండా ఎస్సై పార్ధసారధి అడ్డుకున్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్ అధికారి ఎస్సైని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. పులివెందులలో ఆదివారంనాడు కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. పులివెందుల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సొంత నియోజకవర్గం. ముఖ్యమంత్రి స్వగ్రామం బలపనూరులోకి మీడియా ప్రతినిధులను కూడా రానీయలేదు.












Click it and Unblock the Notifications