బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతలపైకి చెప్పులు విసరడం ఒక సంప్రదాయంగా మారినట్లు ఉంది. తాజాగా ఆ జాబితాలో కర్నాటక ముఖ్యమంత్రి యాడ్యురప్ప చేరారు. చెన్నరాయపట్నంలో ప్రచారంలో పాల్గొన్న యూడ్యురప్పపై జేడీయూ కార్యకర్త ఒకతను చెప్పు విసిరి నిరసన తెలియజేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ధైర్యం ఉంటే ముఖాముఖి తలపడాలని యెడ్యూరప్ప అన్నారు. ప్రచారం కోసమే ఈ విధమైన చర్యలకు దిగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.