మూడో దశ ప్రచారం సమాప్తం
న్యూఢిల్లీ: లోక్ సభ మూడో దశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 107 స్థానాలకు మూడో దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 1567 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోటీలో ఉన్న ప్రముఖుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బిజెపి ప్రధాని అభ్యర్థి అద్వానీ, మాజీ ప్రధాని దేవె గౌడ, జేడీయూ నేత శరద్ యాదవ్, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి బంగారప్ప తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications