మృతుడు సతీష్ ది చిక్ మంగుళూర్
కర్నూలు: కర్నూలు జిల్లా కెసి కెనాల్ పై నిర్మాణంలో ఉన్న వంతెన ప్రమాదంలో మరణించిన సైట్ ఇంజనీర్ సతీష్ కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగూళూర్ కు చెందినవాడు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సతీష్ మృతదేహాన్ని వెలికి తీశారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో శిథిలాల కింద కూరుకుపోయిన బాలకార్మికుడు రవీంద్రను, కార్మికురాలు అంజమ్మను సురక్షితంగా బయటకు తీశారు. మీడియాకు కనిపించకుండా వారిద్దరిని కాంట్రాక్టర్లు అక్కడి నుంచి తప్పించారు.
కాంట్రాక్టర్ పై పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. ప్రమాదం నుంచి బయట పడిన కార్మికురాలు అంజమ్మది మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దమందడి గ్రామం. రవీంద్రది మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం పాంపురం. భోజన విరామ సమయంలో వంతెన కూలడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కార్మికులందరూ భోజనాలకు వెళ్లడంతో చాలా మంది ప్రమాదం నుంచి బయట పడ్డారు. లేకుంటే మరింత మంది ప్రమాదంలో చిక్కుకుని ఉండేవారు. వంతెన నిర్మాణంలో చాలా మంది బాలకార్మికులే పని చేస్తున్నారు.












Click it and Unblock the Notifications