పవన్ కళ్యాణ్ కు హైకోర్టు ఊరట

Pawan Kalyan
హైదరాబాద్: సినీనటుడు, యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు హైకోర్టు ఉత్తర్వుల ద్వారా ఊరట లభించింది. ఆయనపై మహబూబ్‌ నగర్‌ జిల్లా వనపర్తి జిల్లా కోర్టులో డి.కిరణ్‌ కుమార్‌ ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నమోదైన కేసు విచారణను నిలిపివేస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భీమ్‌ రావుబాడ కూల్చివేత సందర్భంగా డిసెంబరు 30న ఇందిరాపార్కు వద్ద బాధితులనుద్దేశించి 'కాంగ్రెస్‌ నేతలు దొంగలు, నమ్మకద్రోహులు, నేరచరిత్ర ఉన్నవారంటూ' పవన్‌ విమర్శించారు.

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయంటూ న్యాయవాది, మహబూబ్‌నగర్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి డి.కిరణ్‌ కుమార్‌ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించిన మేజిస్ట్రేట్‌ సమన్లు జారీ చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పవన్‌ కల్యాణ్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జి.భవానీప్రసాద్‌ విచారణ చేపట్టారు. ఫిర్యాది కిరణ్‌ కుమార్‌ కు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను నిలిపివేస్తూ జస్టిస్ భవానీ ప్రసాద్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+