పాట్నా: బాబ్రీ మసీదు కూల్చివేతలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడీ)నేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా అభివర్ణించారు. కళ్యాణ్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు కారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
లోకసభ ఎన్నికలకు ముందు కళ్యాణ్ సింగ్ బిజెపికి రాజీనామా చేసి ఎస్పీ నేత ములాయం సింగ్ తో చేతులు కలిపారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తున్నారు.