అమెరికాతో యుద్ధం వేళ.. ఇరాన్ రాయబారికి కేంద్ర ప్రభుత్వం సమన్లు
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ దాడులు- ప్రతిదాడులు మొదలయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తోన్నట్లు ఇరాన్ అకస్మాత్తుగా ప్రకటించింది. ఈ సంచలన పరిణామం చోటుచేసుకున్న కొద్ది గంటల్లోనే అమెరికా వైమానిక దళం ఇరాన్‌లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. వైమానిక దాడులను నిర్వహించింది. మూడో రోజు కూడా ఈ దాడులు కొనసాగాయి.
దీనికి ప్రతిగా ఇరాన్.. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్ దాడులతో బెంబేలెత్తిస్తోంది. ఈ క్రమంలో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన కార్గో షిప్ పై భీకర దాడి చేసింది ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. ఒమన్ జలాల పరిధిలో మొంబాసా, అల్ బహియా ట్యాంకర్లపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన ఓ సెయిలర్ మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడ్డ వారిలో ఆరుమంది భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ దేశస్తులు ఉన్నారు. తాము విధించిన ఆంక్షలను లెక్క చేయకుండా హార్ముజ్ స్ట్రెయిట్ గుండా ప్రయాణించే ప్రయత్నం చేయడం వల్లే ఈ దాడి చేయాల్సొచ్చిందని ఐఆర్జీసీ వెల్లడించింది. ఈ దాడిలో భారత సెయిలర్ మరణించడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. తన నిరసనను తెలియజేసింది. ఇరాన్ చర్యలను తప్పుపట్టింది. తన అభ్యంతరం తెలియజేసింది.
ఈ క్రమంలో.. భారత్ లోని ఇరాన్ రాయబార కార్యాలయానికి సమన్లు పంపించింది. తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఎమిరేట్స్ ఆయిల్ ట్యాంకర్లపై దాడి చేయడానికి గల కారణాలను వివరించాలని సూచించింది. దీంతో ఆ దేశ ఉప రాయబారి డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహ్మద్ జవాద్ హొస్సైనీ ఈ ఉదయం 11 గంటల సమయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారును కలిశారు. దాదాపు అరగంట పాటు అక్కడే గడిపారు.
ఈ సందర్భంగా ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులకు లిఖితపూరక వివరణలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధిపై తాము ఆంక్షలను అధిగమించడం, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడం వల్లే మిస్సైల్ దాడి చేయాల్సి వచ్చినట్లు మహ్మద్ జవాద్ హొస్సైనీ వివరణ ఇచ్చారని తెలుస్తోంది. ఈ తాజా దాడుల పరిణామాలు పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలను పెంచాయి. అమెరికా బ్లాకెడ్ విధించడానికి కారణం అయ్యాయి.
#WATCH | Delhi: Iranian diplomats including Deputy Chief of Mission (DCM) Mohammad Javad Hosseini, who were summoned by Ministry of External Affairs, over recent attack on merchant vessels in Hormuz, leave from MEA
— ANI (@ANI) July 14, 2026
An Indian sailor was killed, six others were wounded in Iranian… pic.twitter.com/BUTEFblCdO












Click it and Unblock the Notifications