హద్దు దాటొద్దు.. ఫొటోగ్రాఫర్లకు హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రముఖ బాలీవుడ్ నటి "జరీనా ఖాన్" తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అనుకోకుండానే నటి అయిన ఈ ముద్దుగుమ్మ పలు భాషల్లో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తనదైన శైలిలో నటనతో పాటే గ్లామర్ తో కూడా కుర్రకారులో సపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ. కాగా 1987 మే 14న ముంబైలో జన్మించారు ఈ నటి.
హీరోయిన్ కావాలనే కోరిక లేని జరీనా.. ఒకసారి సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'యువరాజ్' సినిమా సెట్స్‌కు వెళ్లినప్పుడు ఆయన కంటపడ్డారు. ఆమె రూపం, కళ్లు అచ్చం కత్రినా కైఫ్‌లా ఉండటంతో సల్మాన్ ఖాన్ ఆమెను తన తదుపరి చిత్రం 'వీర్' (2010) కోసం ఎంపిక చేశారు. ఈ పీరియడ్ డ్రామాతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. జరీనాకు వరుస అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత 2011లో సల్మాన్ ఖాన్ నటించిన 'రెడీ' చిత్రంలో "క్యారెక్టర్ డీలా" అనే పాటలో ఆమె చేసిన డ్యాన్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన మల్టీస్టారర్ చిత్రం 'హౌస్‌ఫుల్ 2' (2012) లో నటించి తన మొదటి కమర్షియల్ హిట్‌ను అందుకున్నారు. ఈ సినిమాతో ఆమె గ్లామరస్ నటిగా బాలీవుడ్‌లో స్థిరపడ్డారు. 2015లో వచ్చిన 'హేట్ స్టోరీ 3' జరీనా ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. అంతవరకు పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆమె, ఈ చిత్రంలో అత్యంత బోల్డ్ గ్లామరస్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలుగులో గోపీచంద్ హీరోగా వచ్చిన 'చాణక్య' (2019) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె ఒక గూఢచారి (Spy) పాత్రలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా మెరిశారు.
అయితే చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన వారు ఎంతో మంది ఉంటే.. వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించినా ఆశించిన స్థాయిలో వారిని మెప్పించలేక వెండితెరకు దూరమైన వారు ఉన్నారు. ఆ కోవలోనే ఈ బ్యూటీ కూడా స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ గా మారారు.
అసలేం జరిగిందంటే..
ముంబై సెలబ్రిటీ పాపరాజీ(ఫొటోగ్రాఫర్లు)పై హీరోయిన్ జరీన్ ఖాన్ మండిపడ్డారు. ఓ క్లాత్ షోరూమ్ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆమె అక్కడి డ్రెస్సులను పరిశీలించారు. ఈక్రమంలోనే 'ట్రయల్ వేయొచ్చుగా' అని ఓ కెమెరామెన్ అడగడంతో జరీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏంటీ మీ ముందేనా? ఇలాంటి ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు. హద్దు దాటొద్దు' అని హెచ్చరించారు. ఈ వీడియో వైరల్ కాగా మంచి వార్నింగ్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications