పాక్‌లో ఆత్మాహుతి దాడి
పెషావర్: పాకిస్తాన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్స్‌లోని బునేర్, డిర్, స్వాత్ జిల్లాల్లో పాక్ సైనిక బలగాలకు, తాలిబాన్లకు మధ్య జరగుతున్న ఘర్షణలు రెండో వారానికి చేరుకున్నాయి. వాయువ్య పాకిస్థాన్‌లో మందుగుండు సామగ్రితో నిండిన కారుతో ఆత్మాహుతిదళ సభ్యుడొకరు సాయుధదళాల చెక్ పాయింట్‌ను ఢీకొనడంతో నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలావుండగా స్వాత్ లోయలో తాలిబాన్లకు పాక్‌సైన్యం మధ్య భీకరపోరు కొనసాగుతోంది.
తాలిబాన్లతో జరగిన స్వాత్ లోయ ఒప్పదం వీగిపోవడంతో పాక్ సైనిక దళాలకు, మిలిటెంట్లకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆగ్నేయ పాకిస్తాన్ ప్రాంతం లో తాలిబాన్ బలగాలపై పాక్ సైన్యం జరిపిన దాడుల్లో దాదాపు 10 మంది మిలిటెంట్లు, ముగ్గు రు పాక్ సైనికులు మరణించినట్లు పాక్ ప్రకటిం చింది..పాక్ ఆగ్నేయ ప్రాంతంలోని స్వాత్, బునేర్ ప్రాంతంల్లో ఈ ఘర్షణలు జరిగాయి.












Click it and Unblock the Notifications