Annamalai : ఉపఎన్నికల్లో పోటీపై అన్నామలై కీలక నిర్ణయం- తాజా ప్లాన్ ఇదే..!

తమిళనాడులో ఒకప్పుడు బీజేపీ విజయం కోసం వ్యూహప్రతివ్యూహాల్ని రచించి, అందులో విజయం సాధించినా తగిన గౌరవం దక్కకపోవడంతో ఆ పార్టీని వీడిన అన్నామలై(Annamalai).. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సొంతంగా ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దిగుతామని కూడా హింట్స్ ఇచ్చారు. అయితే త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో అన్నామలై పోటీ చేస్తారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీనిపై ఇవాళ అన్నామలై స్పందించారు.

తమిళనాడు రాజకీయ రంగాన్ని సమూలంగా మార్చేందుకు క్షేత్రస్థాయిలో బలమైన పునాది మరియు బలగాలను ఏర్పరచుకోకుండా ఎన్నికల బరిలోకి దిగకూడదనేది తమ ఖచ్చితమైన వ్యూహమని అన్నామలై స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానా లేదా అన్న అంశంపై జరుగుతున్న ప్రచారానికి దీంతో అన్నామలై చెక్ పెట్టేశారు. ప్రస్తుతం 'వి ది లీడర్స్' అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసుకుని వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న అన్నామలై, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడటమే తమ తక్షణ కర్తవ్యమని వెల్లడించారు.

Annamalai Rules Out Immediate Bypoll Contest Unveils We the Leaders Mission for Tamil Nadu

ఇటీవల అన్నామలై పోల్లాచిలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సభ విజయవంతమైంది. దాదాపు 25 వేల మంది వరకు యువత ఈ సభకు తరలివచ్చారు. దీంతో 2031 నాటికి తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో ఒక చారిత్రక మార్పు తీసుకురావడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు సమాజంలో శాశ్వత మార్పు తీసుకురావడానికి ఎన్నికల్లో సాధించే స్వల్పకాలిక విజయాల కన్నా యువతను సరైన మార్గంలో నడిపించడం ఎంతో ముఖ్యమని అన్నామలై పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళల రక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి కీలకమైన, సున్నితమైన సామాజిక అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు మరికొన్ని ప్రతిష్టాత్మక సదస్సులను నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులకు కనీస మౌలిక నిర్మాణాన్ని కల్పించకుండా కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రయోజనం శూన్యమని అన్నామలై భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+