రాజమౌళి తర్వాతి సినిమా ఆ స్టార్ హీరోతోనే..! ఎట్టకేలకు తెలిసిపోయింది..
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అపజయం అంటూ లేని దర్శకుడు. అప్పటి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇప్పటి ఆర్ఆర్ఆర్ వరకూ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి పేరు పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు యావత్ వరల్డ్ వైడ్ గా మారుమోగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మేకర్స్ పక్కా ప్లాన్ తో చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు.
ఈ మేరకు ఇటీవల కొంత గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో మళ్లీ చిత్రీకరణ స్టార్ట్ అయింది. ప్రస్తుతం షూటింగ్ ఆఖరి స్టేజ్ లో ఉంది. వారణాసి చిత్రానికి సంబంధించి యాక్షన్ సీన్స్, ఇతర మేజర్ సీన్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇక చిన్న చిన్న సన్నివేశాలు ఉండగా వాటిని కూడా ఈ ఏడాది అక్టోబర్ లోపు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి మూవీని ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇతర దేశాల్లోనూ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. పృథ్విరాజ్ సుకుమారన్ నెగటివ్ క్యారెక్టర్ లో కుంభగా అలరించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. వారణాసి మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే. ఎల్. నారాయణ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ మూవీ తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా వస్తున్న కథనాల ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో రాజమౌళి భారీ మూవీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సూర్య తన 50వ సినిమా రాజమౌళి దర్శకత్వంలోనే ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సూర్య తో మూవీ చేసే అవకాశాన్ని తాను మిస్ అయ్యానని అప్పట్లోనే రాజమౌళి చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో ఓ భారీ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications