రామేశ్వరం వన్ డే ట్రిప్.. పూర్తి షెడ్యూల్, ఛార్జీలు ఇవే..!

తమిళనాడులో అనేక పుణ్యక్షేత్రాలు, అలాగే ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. అరుణాచలం, రామేశ్వరం, మధురై, తంజావూరు, చిదంబరం లాంటి ప్రధాన ఆలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక రామేశ్వరం ఆలయం భారత్ లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడి రామనాథస్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఖ్యాతి చెందింది. అయితే తక్కువ ధరకే రామేశ్వరం వన్ డే ట్రిప్ వేయాలని ఉందా..? అయితే మీకు బంపరాఫర్.. మదురై నుంచి ఒకే రోజులో రామేశ్వరం జ్యోతిర్లింగం దర్శనం చేసుకునే అవకాశం ఉంది. రామేశ్వరం వన్ డే టూర్ ప్యాకేజీలో భాగంగా పాంబన్ బ్రిడ్జి, అగ్నితీర్థం, రామనాథస్వామి ఆలయం, ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

భారత్ లోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో రామేశ్వరం ఒకటి. ఇక్కడి రామనాథస్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. అలాగే బెనారస్ ఆఫ్ ది సౌత్ అని పిలుస్తుంటారు. సముద్రతీర అందాలు, చారిత్రక ప్రదేశాలను ఒకే రోజులో సందర్శించాలి అనుకునేవారికి రామేశ్వరం వన్ డే టూర్ ప్యాకేజీ సరైన అవకాశంగా నిలుస్తోంది. ఈ టూర్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ టూర్ ప్రయాణ మార్గం రోడ్డు మార్గం, వాహనం: ఏపీ వాహనం, గరిష్ట ప్రయాణికులు 10 మందికి అవకాశం, వారంలో అన్ని రోజులు ఈ టూర్ అందుబాటులో ఉంటుంది.

Rameswaram a prominent pilgrimage site in Tamil Nadu here are the full tour schedule and charges

టూర్ ఛార్జీల విషయానికి వస్తే ఒక వ్యక్తి (సింగిల్ ఆక్యుపెన్సీ) రూ. 7,150 గా ఉంది. ట్విన్ షేరింగ్ లో ఒక్కొక్కరికి రూ. 3,600 గా ఉంది. ఇక ట్రిపుల్ షేరింగ్ లో ఒక్కొక్కరికి రూ. 2,400గా ఉంది. అలాగే పిల్లలకు అయితే రూ. 900 గా ఉంది. ఇక నాలుగు నుంచి ఆరుగురు.. ఒక్కొక్కరికి రూ. 2,350 గా ఉంది. ఈ టూర్ ఉదయం 6 గంటలకు మదురై నుంచి ప్రారంభమవుతుంది. అలా ఉదయం 9 గంటల 30 నిమిషాలకు రామేశ్వరం చేరుకుంటారు. ఇక మార్గమధ్యలో పాంబన్ బ్రిడ్జ్ అందాలను వీక్షించే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడే ఉన్న పంచముఖి హనుమాన్ ఆలయం, రామర్ పాదం, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక స్థూపం తదితర ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. ఇప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+