ఇస్లాం సంస్ధకు థాకరే 'శాల్యూట్'
ముంబై: హైందవ ధర్మ సిద్ధాంత వాది, శివసేన అధినేత బాల్‌థాకరే ఓ ఇస్లాం ఆద్యాత్మిక సంస్థకు శాల్యూట్ చేశారు. ముంబై పేలుళ్ళలో పట్టుబడిన ఉగ్రవాది కసబ్ తరపున వాదిస్తున్న లాయర్ ఖాజ్మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ జింఖానా అనే ఆద్యాత్మిక సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని బాల్‌థాకరే స్వాగతించారు. దేశంలోని మత సామరస్యానికి ఇస్లాం పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శంగా నిలుస్తుందని బాల్‌థాకరే 'సామ్నా' పత్రికకు రాసిన ఎడిటోరియల్ కథనంలో పేర్కొన్నారు.
ముస్లీంలందరూ ఇదేవిధంగా వ్యవహరిస్తే దేశంలో హింసకు తావుండదని ఆయన అభిప్రాయపడ్డారు. కసబ్ ఒక క్రూరమృగమని, దేశం నడిబొడ్డున వందలాది ప్రాణాలను బలిగొన్న అతన్ని సమాజం వెలివేయాలని తెలిపారు. ఇలాంటి హింసావాదానికి చట్టం రక్షణ కల్పిస్తే హిందువులతో పాటు ముస్లీములకు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండవని ఎడిటోరియల్ కథనంలో థాకరే వివరించారు.












Click it and Unblock the Notifications