కలెక్టర్ ను వివరాలు అడిగిన చిరు
హైదరాబాద్ : నగరంలోని భోలక్‌పూర్ కలుషిత నీటి సరఫరాలపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కలెక్టర్ నవీన్ మిట్టల్ తోను, జలమండలి జలమండలి ఉన్నతాధికారులతోను బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ఆరోగ్యస్థితి, ప్రభుత్వసాయంపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల వద్ద సాయం అందించేందుకు పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆయన కోరారు. అనంతరం విశాఖ మన్యంలో విషజ్వరాల బారినపడ్డ ఆదీవాసీలను పరామర్శించేందుకు విశాఖకు బయలుదేరారు.
నిన్న భోలక్ పూర్ బాధితులను వివిధ ఆస్పత్రులకు వెళ్ళి చిరంజీవి పరామర్శించి వచ్చారు. నేడు కలెక్టర్ తో ఆయన ఫోన్ లో మాట్లాడం ఎన్నికల్లో విజయంపై దీమాతో ఉన్నారనడానికి నిదర్శనమని ప్రరాప వర్గాలు చెన్నాయి.












Click it and Unblock the Notifications