లారీ బోల్తాపడి 12 మంది మృతి
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజాము 4.30 గంటలకు లారీ బోల్తా పడిన సంఘటనలో 12 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. వీరంతా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి, గోకర్ల గ్రామాలకు చెందిన వలస కూలీలు. కొవ్వూరు నుంచి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన వారిలో ఎనిమిది మంది పెద్దలు, నలుగురు పిల్లలు ఉన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి శ్రీకాకుళం అద్దాల లోడుతో వెళుతున్న లారీ ఈరోజు ఉదయం 5-30 గంటల ప్రాంతంలో అడ్డు రోడ్డు వద్ద లోయలోకి బోల్తా పడింది. మృతుల్లో 5గురు పిల్లలు, ముగ్గురు మహిళలు, నలుగురు పెద్దలు ఉన్నారు. మృతులంతా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం, గోకర్లపల్లికి చెందిన వలసకూలీలుగా పోలీసులు పేర్కొన్నారు. ఘటనలో గాయపడిన వారిని నక్కపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.లారీలో మొత్తం 16 మంది ఉన్నట్లు తెలియవచ్చింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలియవచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications