మైక్రోసాఫ్ట్‌లో 5,000 మందికి ఉద్వాసన
సీటెల్: సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల రంగంలో అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్ మరో 5,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇప్పటికే 1,400 మంది ఉద్యోగులను ప్యాకేజీ విధానంతో ఏడాదిన్నర పాటు పక్కనపెట్టిన మైక్రోసాఫ్ట్ ఉన్నట్లుండి మరో 5,000 మందిపై ఇదే సూత్రాన్ని ప్రయోగించింది. తొలగించిన ఉద్యోగులకు కొంత మొత్తం చేతిలో పెట్టి వారికి విధులకు రానవసరం లేదని పింక్‌స్లిప్‌లను జారీ చేసింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ వచ్చే రెండేళ్ళలో మూడువేల ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications