యాదగిరిగుట్ట ఉత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహుని జయంత్యుత్సవాలు వైభవంగా బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈనెల 8వ తేదీవరకు జరుగుతాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఇ శ్రీనివాస రావు తెలిపారు. ఈ ఉత్సవాలకు హజరయ్యే భక్తుల సౌకర్యం కోసం చలువ పందిళ్ళు ఏర్పాటు చేసి, క్యూలైన్లలో మంచినీటి సదుపాయంకల్పిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు భక్తులందరికీ అన్నదానం, ఉచిత ప్రసాద వితరణ జరుగుతుందని వివరించారు. నేటి నుంచి 8వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం కొండపై సరస్వతి కళామందిరంలో ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసామన్నారు.












Click it and Unblock the Notifications