వైఎస్ రాజారెడ్డి హత్య కేసు: 11 మందికి జీవితఖైదు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈకేసులో 11 మందికి హైకోర్టు గతంలో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నేడు యావజ్జీవ శిక్షను సుప్రీంకోర్టు నిర్ధారించిన వారు: పెర్ల సోమశేఖరరెడ్డి, పెర్ల శేషారెడ్డి, అన్నా రెడ్డి సాంబశివారెడ్డి, అన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పెర్ల రామాంజనేయరెడ్డి, పెర్ల రామకృష్ణారెడ్డి, పోరెడ్డి విశ్వనాథరెడ్డి, ఒడ్డెరపు ఓబయ్య, వల్లె వెంకట్రాంరెడ్డి, బాపిరెడ్డి లక్ష్మిరెడ్డి, రాగిపిండి సుధాకర్‌రెడ్డిలు ఉన్నారు. అయితే వీరిలో గోల్లలగూడురు జంట హత్య కేసులో వెంకట్రాంరెడ్డి, లక్ష్మిరెడ్డి, సాంబశివారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. 1998 జులై 23న ఓ పెళ్లి నుంచి వస్తున్న వైఎస్ రాజారెడ్డిని వేముల కల్వార్టు వద్ద వేటకోడవళ్లతో నరికి హత్య చేశారు. దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు 2006లో 13 మందికి జీవిత ఖైదు విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తు 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications