మావోల దాడిలో 10 మంది మృతి
దంతెవాడ: ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. దంతెవాడ జిల్లాలోని వింజనం వంతెనపై పోలీసులు, సల్వాజుడుం కార్యకర్తలు కలిసి ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను బుధవారం మావోయిస్టులు మందుపాతరతో పేల్చివేశారు. ఈ దుర్ఘటనలో మొత్తం పది మంది మృతిచెందినట్లు తెలుస్తున్నది. మృతుల్లో అయిదుగురు సల్వాజుడుం కార్యకర్తలు, ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నట్లు సమాచారం. మిగతా సమాచారం అందవలసి వున్నది.












Click it and Unblock the Notifications