నేనెందుకు ప్రధాని కాలేను: మాయా
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె ఆగ్రాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రి కాగలిగినప్పుడు నేనెందుకు కాలేను అని ప్రశ్నించారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను... విద్యావంతురాలైన దళిత మహిళను, యూపీలాంటి పెద్ద రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు దేశాన్ని కూడా పాలించే సత్తా తనకు ఉందని మాయావతి అన్నారు. కాంగ్రెస్, బిజెపిలు అనామకులను ప్రధాని అభ్యర్ధులుగా ప్రకటిస్తున్నప్పుడు తాను ఎందుకు ప్రధాని అభ్యర్ధిగా రంగంలో ఉండకూడదని ఆమె ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications