పెళ్ళి లారీ బోల్తా..ఇద్దరు మృతి
మహబూబ్‌నగర్:మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా సుమారు 50 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది.
వెల్దిండి వద్ద పెళ్ళి బృందంతో ప్రయాణిస్తున్న డిసిఎం వ్యాన్‌ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications