ఫిఫా సెమీస్ లో కొదమసింహాల పోరు- ఫ్రాన్స్ కు క్లినికల్ షాట్: ఎంబాప్పె కంట తడి: ఫైనల్ లో..!!

ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. టైటిల్ హాట్ ఫేవరెట్ గా ఉంటూ వచ్చిన ఫ్రాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. స్పెయిన్ ముందు తలవంచింది. డల్లాస్ వేదికగా సాగిన హోరాహోరీ మ్యాచ్‌లో బలమైన ఫ్రాన్స్‌పై స్పెయిన్ ఘనవిజయం సాధించింది. స్పెయిన్ 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది. స్పెయిన్ తరఫున మైకెల్ ఒయర్జబాల్, పెడ్రో పోరో తమ అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు అపురూప విజయాన్ని అందించారు.

ఫ్రాన్స్ ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినప్పటికీ స్పెయిన్ పటిష్టమైన డిఫెన్స్ ను ఛేదించడంలో విఫలం అయ్యారు. ఓటమి కోరల నుంచి జట్టును బయటపడేయలేకపోయారు. సూపర్ స్టార్ ఎంబాప్పె కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈ విజయంతో స్పెయిన్.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో అడుగు పెట్టింది. రెండో సెమీ ఫైనల్ విజేత అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్ తో ఫైనల్ లో తలపడుతుంది. రెండో సెమీస్ ఈ అర్ధరాత్రి జరుగనుంది.

Spain Storm Past France 2-0 to Reach the World Cup Final Showdown as Oyarzabal and Porro Shines

ఫ్రాన్స్ కు ఈ మ్యాచ్‌లో ఏడు కార్నర్ కిక్స్ లభించినప్పటికీ, వాటిని పాయింట్ల రూపంలోకి మార్చుకోలేకపోయిందా జట్టు. ఫార్వర్డ్‌ లైన్ అట్టర్ ఫ్లాప్ అయింది. డిఫెన్స్‌లో సమన్వయం లోపించింది. అవే ఫ్రాన్స్ ను ముంచాయి. స్పెయిన్ ఆటగాళ్లు గ్రౌండ్‌లో చూపిన అంకితభావం, పక్కా ప్రణాళికలు వారిని విజేతగా నిలిపాయి. ఈ విజయంతో స్పెయిన్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసుకుంది. మరోసారి జగజ్జేతగా నిలవడానికి ఓ అడుగు దూరంలో నిలిచింది.

ఈ మ్యాచ్ అభిమానుల్లో ఎంతో ఉత్కంఠను రేకెత్తించింది. ప్రారంభమైన మొదటి నిమిషం నుంచే ఇరు జట్లు దూకుడుగా మైదానంలోకి దూకాయి. 22వ నిమిషంలో స్పెయిన్ అద్భుతమైన వ్యూహాత్మక మూవ్ చేసింది. జట్టు స్టార్ స్ట్రైకర్ మైకెల్ ఒయర్జబాల్ క్లినికల్ షాట్‌తో మ్యాచ్ తొలి గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌తో ఫ్రాన్స్ ఆటగాళ్ల శైలి ఒత్తిడికి గురైంది. ప్రథమార్ధంలో స్కోరు సమం చేసేందుకు ఫ్రాన్స్ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో స్పెయిన్ ఆధిక్యంలో కొనసాగింది.

ద్వితీయార్ధంలో కూడా స్పెయిన్ తన పట్టు కోల్పోలేదు.. సరికదా మరింత పెంచుకుంది. మ్యాచ్ 58వ నిమిషంలో డాని ఓల్మో అందించిన అద్భుతమైన అసిస్ట్‌ను ఉపయోగించుకున్న డిఫెండర్ పెడ్రో పోరో బంతిని నేరుగా గోల్‌ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో స్పెయిన్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ రెండో గోల్ తర్వాత ఫ్రాన్స్ మరింత ఒత్తిడికి లోనైంది. మ్యాచ్ ముగిసే సమయానికి నాలుగు నిమిషాల ముందు స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె మైదానంలోకి వచ్చాడు గానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల వ్యూహాత్మక మార్పులు చేశాయి. ఫ్రాన్స్ మ్యాచ్ గమనాన్ని మార్చడానికి ఆడ్రియన్ రాబియట్ గ్రౌండ్ వీడాక మను కోనే, బ్రాడ్లీ బార్కోలా వంటి కీలక ఆటగాళ్లను రంగంలోకి దింపింది. అలాగే రేయాన్ చెర్కీ తదితరులు చివరి నిమిషాల్లో జట్టును గట్టెక్కించేందుకు తీవ్రంగా శ్రమించారు. స్పెయిన్ జట్టు తమ ఆధిక్యాన్ని కాపాడుకోవడానికి పెడ్రి, నికో విలియమ్స్ వంటి స్టార్ ప్లేయర్లను మ్యాచ్ ముగింపు దశలో బరిలోకి దించింది. డిఫెన్స్ ను మరింత సుస్థిరం చేసుకుంది.

ఈ మ్యాచ్ గణాంకాలను పరిశీలిస్తే.. ఆట ఎంత హోరాహోరీగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. స్పెయిన్ 51 శాతం బంతిని తన ఆధీనంలో ఉంచుకోగలిగింది. దాదాపుగా ఫ్రాన్స్ అదే స్థాయి పొసెషన్ ను రికార్డు చేసింది. 49 శాతంతో గట్టి పోటీ ఇచ్చింది. అయినా ఒక్క గోల్ కూడా సాధించలేదీ టీమ్. ఫ్రాన్స్ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై ఏకంగా 14 షాట్లు కొట్టగా, అందులో నాలుగు షాట్లు మాత్రమే లక్ష్యం వైపు దూసుకెళ్లాయి గానీ వాటి కీపర్ సమర్థవంతంగా అడ్దుకోగలిగాడు. మరోవైపు కొట్టిన స్పెయిన్ 10 షాట్లను గోల్ పోస్ట్ వైపు కొట్టగా.. అందులో రెండు టార్గెట్ షాట్లు అయ్యాయి. గోల్స్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+