అబ్బే, బొత్సతో మాట్లాడలేదే: చిరు
విశాఖపట్నం: తాను కాంగ్రెస్ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణతో మాట్లాడలేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఈ విషయంపై మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. కింగ్‌ఫిషర్ విమానంలో బొత్స, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో నేను వెళ్లాం, అలాంటిది ఎలా మాట్లాడుకుంటామని ఆయన ప్రశ్నించారు. దీనిపై మీడియా మరీ ఎక్కువ చేసి చూపిస్తొందని రుసరుసలాడారు.
నిన్న వైజాగ్ విమానాశ్రయం వీఐపి లాంజ్ లో బొత్స, చిరంజీవి కొన్ని నిముషాల సేపు మాట్లాడుకున్న మాట వాస్తవమని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. తాను వెళ్ళాల్సిన విమానం మిస్ కావడంతో లాంజ్ లో చిరుతో ముచ్చటించిన మాట వాస్తవమని బొత్స అన్నారు. బొచ్చతో మాట్లాడాను కానీ రాజకీయాల ప్రస్తావన రాలేదని నిన్న అన్న చిరంజీవి అసలు ఆయనతో ఏమీ మాట్లాడలేదని నేడు చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications