అధికారులపై సిఎం చిటపట
హైదరాబాద్ : భోలక్‌పూర్ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు అధికారుల వైఫల్యమే కారణమని తేలడంతో వారిపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు వనమా, గల్లా అరుణకుమారి, రోశయ్య ముఖేశ్‌గౌడ్, కోనేరురంగారావు, జీవన్‌రెడ్డి, ఆనం రాంనారాయణ, ప్రభుత్వ సలహాదారు కేవీపీ, ప్రధాన కార్శదర్శి రమాకాంత్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications