టెక్కీకి ఆస్పత్రిని ఊడ్చే శిక్ష
హైదరాబాద్: ఇద్దరు స్త్రీలను వేధించిన టెక్కీకి రాష్ట్ర హైకోర్టు వినూత్నమైన శిక్ష విధించింది. నెలపాటు ఆ యువ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆస్పత్రి ఆవరణను ఊడ్చి శుభ్రం చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. డెల్ కంప్యూటర్స్ లో పని చేస్తున్న 21 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎం. దినేష్ కుమార్ కు ఆ శిక్ష విధిస్తూ జస్టిస్ బి చంద్రకుమార్ ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల ముందు లొంగిపోవాల్సిందిగా కోర్టు దినేష్ కుమార్ ను ఆదేశించింది. గాంధీ అస్పత్రి ఆవరణలో రోజుకు గంటపాటు ఊడ్చాలని ఆదేశించింది. తన సౌకర్యాన్ని బట్టి ఆస్పత్రిని ఊడ్చే సమయాన్ని ఎంచుకునేందుకు కోర్టు అతనికి అవకాశం ఇచ్చింది. దినేష్ కుమార్ వచ్చాడా, లేదా నమోదు చేయడానికి రిజిష్టర్ పెట్టాలని హైకోర్టు గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ ను ఆదేశించింది. మల్కాజిగిరిలో మోటార్ సైకిల్ పై వెళ్తూ మార్చి 21వ తేదీన దినేష్ కుమార్, అతని మిత్రుడు బాలరంగశాయి ఇద్దరు మహిళల దుపట్టాలు లాగారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వారిద్దరిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. వెంకటకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం దినేష్ కుమార్ పెట్టుకున్న పిటిషన్ ను జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్నమైన శిక్ష విధించింది.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications