మలక్ పేటలో 10 మందికి అస్వస్ధత
హైదరాబాద్: భోలక్ పూర్ ఘటన మరవక ముందే రాజధానిలో మరిన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్: భోలక్ పూర్ తరహాలోనే మలక్ పేట్‌లోని ఓల్డ్ దోభీగల్లీలో కలుషిత నీటిని తాగి దాదాపు 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మంచి నీటి కుళాయిలో మురుగు నీరు వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకొంటున్నారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం దేవునిపల్లిలో కలుషిత నీటిని తాగి నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.












Click it and Unblock the Notifications