"లక్షగళ సంకీర్తనార్చన"నేడే
సికింద్రాబాద్: ఈ (ఆదివారం)సాయంత్రం పరేడ్‌గ్రౌండ్స్ లక్షగళ సంకీర్తనార్చనతో గోవింద నామస్మరణతో మార్మోగనుంది. అన్నమాచార్య 601వ జయంతిని పురష్కరించుకుని టీటీడీ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్రల ఆధ్వర్యంలో ఈ "లక్ష గళ సంకీర్తనార్చన"కు సిద్ధం చేశారు. గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గళ సారథ్యంలో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సంకీర్తనార్చనలో మొత్తం ఏడు కీర్తనలను అలపిస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాల వారీగా బ్లాకులను ఏర్పాటు చేశారు. ఒక్కోక్క బ్లాకులో కనీసం 2500 మంది కూర్చునేందుకు వీలు ఉంటుంది. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా సికింద్రాబాద్ పీజీ కాలేజి, జింఖానాగ్రౌండ్, మహబూబియా కాలేజి, రూప్ ఫాండ్స్‌లలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications