నీటి బాధితులు 151 మంది డిశ్చార్జ్
హైదరాబాద్: కలుషిత నీటి వల్ల గత వారం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 151 మంది భోలక్‌పూర్ వాసులు డిశ్చార్జ్ అయ్యారు. వీరి ఆరోగ్యం మెరుగుకావడంతో డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు వెల్లడించారు. మరో 18 మందిని త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వారు తెలిపారు. ఈ నెల ఆరో తేదీ నుంచి ఆస్పత్రిలో ఎలాంటి కలరా వ్యాధి కేసులు నమోదు కాలేదని వారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications