చిరు మావైపు రావచ్చు: శరద్
న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తమ కూటమిలో చేరగలదని ఆశిస్తున్నట్లు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయె) కన్వీనర్ శరద్ యాదవ్ అన్నారు. చిరంజీవితో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తమతో రాగలరని అనుకుంటున్నట్లు ఆయన ఒక తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీల మద్దతుతో కేంద్రంలో ఎన్డీయె ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
చంద్రబాబు తమకు పాత మిత్రుడేనని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తమతో చేరడమే కాకుండా కొంత మంది కొత్త మిత్రులను తేవడానికి ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు కేంద్రంలో ఎన్డీయెకు మద్దతు తెలుపగలవని ఆశిస్తున్నట్లు బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు.












Click it and Unblock the Notifications