యుపిఎకు కలిసొచ్చే ఆంధ్ర
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు బలం తగ్గకపోవడమే కేంద్రంలో యుపిఎకు లాభిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు 22 నుంచి 29 లోకసభ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెసు బలం తగ్గలేదని, దీంతో కాంగ్రెసు 42 లోకసభ స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చునని అంచనాలు సాగుతున్నాయి. తెలుగుదేశం, వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితిలతో కూడిన మహాకూటమి లోకసభ స్థానాల విషయంలో కాంగ్రెసు బలాన్ని తగ్గించలేకపోయిందని అంటున్నారు.
తెలుగుదేశం ఓట్ల శాతం 7 శాతం తగ్గిందని సిఎన్ ఎన్ - ఐబియన్ సర్వే తెలియజేస్తోంది. ప్రజారాజ్యం పార్టీ కోస్తాలో తెలుగుదేశం, కాంగ్రెసు ఓట్లకు గండి కొట్టిందని భావిస్తున్నారు. కాంగ్రెసుకు దళితులు, ముస్లింలు అనుకూలంగా ఓటేసినట్లు అంచనాలు వేస్తున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ లోకసభ స్థానాలు గతంలో కన్నా పెరుగుతాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి 10 సీట్లకు మించి రావని చెబుతున్నారు. తెరాసకు ఐదు సీట్లు రావచ్చునని అంచనా. వామపక్షాలకు చెరో సీటు రావడం కూడా కష్టమేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications