బిజెపి నేతలకు ఢిల్లీ పిలుపు

కొత్త మిత్రులను వెతికే పనిలో ఇప్పటికే బిజెపి పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్డీయెలో చేరిన నేపథ్యంలో మరిన్ని ప్రాంతీయ పార్టీలను తన వైపు లాక్కునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసి అమలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీని, ప్రజారాజ్యం పార్టీని కూడా బిజెపి దువ్వుతోంది. ఏం చేయాలో, ఏం చేస్తో మంచిదో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి తెలుసునని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
కాగా, బిఎస్పీ నేత మాయావతిని కూడా చేరదీసేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలు పెట్టింది. మాయావతితో మంతనాలు జరిపేందుకు అరుణ్ జైట్లీని నియోగించింది. మరో వైపు అన్నాడియంకె నేత జయలలితను కూడా దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు సాగిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించుకునేందుకు తన అగ్రనేతలను బిజెపి ఢిల్లీకి అహ్వానించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications