కారు ప్రమాదంలో కమిషనర్ మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ పుత్తూరు కృష్ణయ్య మృతి చెందారు. కృష్ణయ్య తన ఇద్దరు పిల్లలను ఎంసెట్ పరీక్ష రాయించేందుకు తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం వెంకటాపురం సమీపంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న సాగర్ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన పిల్లలు ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications