యుపిఎ, ఎన్డీయె పోటాపోటీ
న్యూఢిల్లీ: యుపిఎ అతి పెద్ద కూటమిగా అవతరిస్తుందని ఆంగ్ల చానెళ్లు చెబుతున్నాయి. అయితే యుపిఎకు, ఎన్డీయెకు మధ్య పోటాపోటీ ఉంటుందని అంచనా వేశాయి. సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ పూర్తికావడంతో పలు ఆంగ్ల వార్తాఛానళ్లు బుధవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించాయి. గత ఎన్నికల్లో 60 స్థానాలు సాధించి ప్రస్తుతం మూడో కూటమి కోసం ప్రయత్నిస్తున్న వామపక్షాలు మాత్రం బాగా దెబ్బతింటాయని అంటున్నాయి. కాంగ్రెస్ మళ్లీ అతిపెద్ద పార్టీగానే ఉంటుందని, దరిదాపుగా 2004 ఎన్నికల నాటి పరిస్థితే పునరావృతమవుతుందని చెబుతున్నాయి. యూపీఏ 185-205 స్థానాలు సాధిస్తుందని, అందులో కాంగ్రెస్ వాటా 145 నుంచి 160 స్థానాల వరకు ఉంటుందని, ఎన్డీఏ 180, తృతీయ కూటమి 134 సాధిస్తాయని సీఎన్ ఎన్-ఐబీఎన్ అంచనా.
'హెడ్‌లైన్స్ టుడే' యూపీఏకి 191 ఇవ్వగా ఇండియా టీవీ ఛానల్ ప్రకారం యుపిఎకు 195 వరకు రావచ్చని తెలిపింది. టైమ్స్‌నౌ ఛానల్ కాంగ్రెస్ కు సొంతగా 154, భాజపాకు 142, వామపక్షాలకు 38 వస్తాయని అంచనా వేయగా 'స్టార్ న్యూస్' కాంగ్రెస్ కు 155, బిజెపికి 153 వస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో యూపీఏ, గుజరాత్, బీహారుల్లో ఎన్డీఏ ఆధిక్యం సాధిస్తాయని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications