వాటర్ వర్క్స్ జీఎం ఆస్తులు 10 కోట్లు
హైదరాబాద్: ఏసీబీ వలలో మరో భారీ అవినీతి చేప చిక్కింది. హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ విభాగంలో జనరల్ మేనజర్‌గా పనిచేస్తున్న కె. కొండారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. లకిడీకపూల్ లోని ఆయన సొంత ఫ్లాట్, వాటర్‌వర్క్స్ కార్యాలయం, మహబూబ్ నగర్ జిల్లాలోని ఆయన స్వగ్రామం గోపాల్‌పేటలో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. లక్ష రూపాయల నగదు, బంగారు ఆభరణాలతోకలిపి మొత్తం కోటి రూపాయలకుపైగా ఆస్తులు బయటపడినట్లు అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ పదికోట్లకు పైగానే ఉంటుందని చెప్పారు. నగర శివార్లలోని షాబాద్, లకిడీకపూల్, రాయదుర్గం, కూకట్ పల్లి, పోచారం, చెంగిచెరల, పోచంపల్లి తదితర ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ మూర్తి తెలిపారు.












Click it and Unblock the Notifications