ఎన్డీయెను అడ్డుకుంటాం: కారత్

Prakash Karat
న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయె)ని అధికారంలోకి రానివ్వమని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపి నేతృత్వంలోని ఎన్డీయె అధికారంలోకి రాకుండా చూస్తామని ఆయన ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాంగ్రెసుతో తాము కలవబోమని, కాంగ్రెసుకు బయటి నుంచి కూడా మద్దతివ్వబోమని ఆయన చెప్పారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పై తమకు వ్యక్తిగత వ్యతిరేకత లేదని, కాంగ్రెసు విధానాలను వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఆయన చెప్పారు.

తృతీయ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెసు మద్దతును వామపక్షాలు కోరుతాయని, కాంగ్రెసు అందుకు సిద్ధపడకపోతే యుపిఎ ప్రభుత్వానికి వామపక్షాలు బయటి నుంచి మద్దతిస్తాయని భావిస్తున్నారు. సిపిఎం సమావేశాలు ఈ నెల 16 నుంచి 17వ తేదీ వరకు వరసగా జరగనున్నాయి. తృతీయ కూటమి సమావేశం ఈ నెల 18వ తేదీన జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+