డబ్బుతోనే గెలిచారు:హరికృష్ణ
హైదరాబాద్: గత నెలలో జరిగిన ఎన్నికల్లో ధన ప్రభావం అధికంగా ఉండటం వల్లే తెలుగుదేశం ఓడిపోయిందని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు,ఎంపీ నందమూరి హరికృష్ణ అన్నారు.ఎన్నికల పక్రియ ప్రారంభానికి ముందు నుంచి టీడీపి కేంద్ర కార్యాలయం ఎన్ టీ ఆర్ భవన్ కు దూరంగా ఉంటున్న హరికృష్ణ పార్టీ ఓడిన వెంటనే వచ్చారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.అభివృధ్దికి ఓటు వేస్తారని అయితే ఈ ఎన్నికల్లో ధన ప్రబావం అధికంగా ఉందన్నారు. పార్టీ ఓటమికి గల కారణాలను తాము విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.శత్రువును తక్కువగా అంచనా వేయకూడదన్నారు.పార్టీ పరంగా,తమ పరంగా ఎన్నికల పక్రియకు సంబంధించి ఎలాంటి తప్పులు చేయలేదన్నారు.హరికృష్ణ తో పాటు బాలకృష్ణ పార్టీ అధినేత చంద్రబాబు తో భేటీ అయ్యారు.పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.












Click it and Unblock the Notifications