'చెప్పు తినే కుక్క'-అల్లు పై పరకాల
హైదరబాద్: ప్రజారాజ్యం పార్టీపై, చిరంజీవిపై మరోసారి పరకాల ప్రభాకర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.... పీఆర్పీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు చిరంజీవి చరిస్మాతో గెలవలేదని వారి కృషితోనూ...స్థానిక అంశాల ప్రభావంతోనే గెలిచారని అన్నారు. పీఆర్పీ టికెట్‌పై గెలిచిన వారు ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్టహ్రితానికి కృషి చేయాలని సూచించారు. "చెప్పుతినే కుక్క చెరకు తీపి ఎరుగునా" అన్న మహాకవి వేమన వాక్కు ప్రజారాజ్యం ఓనర్‌కు సరిపోతుందని ఎద్దేవా చేశారు. అల్లు అరవింద్ ను ప్రజారాజ్యం ఓనర్ గా పరకాల చాలా కాలంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications