Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఅర్ ఎస్ కారు బోల్తా

హైదరాబాద్‌: ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి తీవ్ర నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశం ప్రస్తుతానికి సోదిలో లేకుండా పోయినట్టే. రాష్ట్రంలో కేంద్రంలో చక్రం తిప్పుతామన్న టీఆర్‌ఎస్‌ 'కారు'కు ఎన్నికల ఫలితాలు సడన్ బ్రేకు వేశాయి. దీనితో కారు బోల్తాపడింది. ఆ పార్టీ 10 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికలతో పోల్చితే టీఆర్‌ఎస్‌ బలం గణనీయంగా తగ్గింది. తెలంగాణలోని పది జిల్లాల్లో ఖమ్మం మినహా మిగతా 9 జిల్లాల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌కి మూడింట ప్రాతినిధ్యమే కరవైంది.

రంగారెడ్డి, హైదరాబాద్‌, నల్లగొండ జిల్లాల్లో ఖాతా తెరవలేదు. పార్టీకి ఆయువుపట్టు అని చెప్పుకొనే వరంగల్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ నామమాత్ర ప్రాతినిధ్యమే దక్కింది. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో పార్టీ అధినేత కేసీఆర్‌, మెదక్‌ జిల్లా సిద్దిపేట అసెంబ్లీస్థానం నుంచి ఆయన మేనల్లుడు తన్నీరు హరీష్‌రావు, కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి తనయుడు కె.తారక రామారావు మాత్రం గెలిచారు. ఏకైక మహిళా అభ్యర్థి విజయశాంతి మెదక్‌ లోక్‌సభ స్థానంలో బొటాబొటీ మెజార్టీతో గెలిచారు.

కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌లో టీఆర్‌ఎస్‌ కేవలం ఒక్క అసెంబ్లీ స్థానాన్నే గెల్చుకోగలిగింది. ఒక్క ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో మాత్రమే టీఆర్‌ఎస్‌ కొంత మెరుగైన ఫలితాలను సాధించింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన పార్టీ మూడింట గెలిచింది. కరీంనగర్‌ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి నాలుగు స్థానాల్లోనే విజయం సాధించింది.

ఇక్కడ ఓడిపోయిన ప్రముఖుల్లో హన్మకొండ సిటింగ్‌ ఎంపీ (కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థి) బి.వినోద్‌కుమార్‌, మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు (హుస్నాబాద్‌) ఉన్నారు. వరంగల్‌ జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో పోటీచేయగా.. ఒక్క వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాన్నే గెల్చుకుంది. మిగతా ఆరు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కోల్పోయింది.

ఇక్కడ ఓడిన పార్టీ ముఖ్యుల్లో శాసనసభా పక్ష మాజీ నేత డాక్టర్‌ జి.విజయరామారావు (వర్థన్నపేట), మధుసూదనచారి (భూపాలపల్లి), కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి (జనగామ), అజ్మీరా చందూలాల్‌ (మహబూబ్‌బాద్‌) ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూడు అసెంబ్లీస్థానాల్లోనూ పార్టీ అడ్రస్‌ గల్లంతైంది. అదేజిల్లాలో పోటీపడ్డ నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలోనూ ఓడిపోయింది.

మెదక్‌ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే, హరీశ్‌రావు తప్ప మిగిలినవారు ఓడిపోయారు. ఇక్కడ దుబ్బాక సిటింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా ఓటమికి గురయ్యారు. నల్లగొండ జిల్లాలో పోటీచేసిన మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజామాబాద్‌లో ఎల్లారెడ్డి తప్ప మరెక్కడా గెలవలేదు.

2004 ఎన్నికల్లో కంటే ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 'పనితీరు' దారుణంగా ఉంది. అప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 26 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ.. పార్టీకి దూరం కాగా.. మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు 2008లో తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే.. ఏడు ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీస్థానాలే మిగిలాయి. ఇపుడు ఆ సిటింగ్‌ స్థానాల్లోనూ కొన్నింటిని కోల్పోయింది. అంతిమంగా 10 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+