రాష్ట్రపతికి ఎస్పీ మద్దతు లేఖ

ఎస్పీకి 23 మంది లోకసభ సభ్యులున్నారు. మరో ఇద్దరు స్వతంత్రుల మద్దతు కూడా ఎస్పీకి ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తు కుదుర్చుకోలేకపోయింది. ఆర్జెడీ, ఎల్జెపిలతో కలిసి ఎస్పీ నాలుగో కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసింది. తాము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్దంగా ఉన్నామని ములాయం సింగ్ సోమవారం మైన్పూర్ లో చెప్పారు. కొత్త ప్రభుత్వాన్ని తాము బలపరుస్తామని అమర్ సింగ్ తర్వాత చెప్పారు.
రెండు రోజుల క్రితం తాను, ములాయం సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలవడానికి వెళ్లామని, తమకు మద్దతివ్వాలని మన్మోహన్ తమను అడిగారని, నిన్న సోమవారం కూడా ప్రధాని తమ మద్దతు కోరారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications