రైలు పట్టాల తొలగింపు: బ్రిడ్జి పేల్చివేత
ఖమ్మం: నక్సల్స్ పై దమనకాండను నిరసిస్తూ మావోయిస్టులు ఆంధ్రా, ఒరిస్సాల్లో రెండు రోజుల బంద్ సందర్భంగా బుధవారం స్వల్పంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. నక్సల్స్ బంద్ ను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, భద్రాచలం, గోదావరి ఏజెన్సీ, వరంగల్‌లోని మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రద్దు చేసింది. సాధారణ వాహనాలు సైతం వెళ్లకుండా మావోయిస్టులు చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు.
బంద్ ను విజయవంతం చేయడానికి మావోయిస్టులు రవాణా వ్యవస్థపైనే దృష్టి సారించారు. రోడ్లపై చెట్లు పడేసి, బ్రిడ్జిలు కూల్చి రాకపోకలను ఆపివేశారు. దీంతోపాటు దంతెవాడ జిల్లాలో బచేలి వద్ద రైలుపట్టాలు తొలగించారు. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మావోయిస్టులు దంతెవాడ-బైలదిల్లా మార్గంలో బ్రిడ్జిని పేల్చివేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications