జూన్ 1నుంచి లోకసభ సమావేశం
న్యూఢిల్లీ: 15వ లోకసభ తొలి సమావేశం జూన్ 1వ తేదీ నుంచి జరగనుంది. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన శనివారం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హోం మంత్రి చిదంబరం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జూన్ 4వ తేదీన ప్రసంగిస్తారు. అదే రోజు రాజ్యసభ కూడా సమావేశమవుతుంది.
లోకసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు జూన్ 1, 2 తేదీల్లో ప్రమాణం చేస్తారు. స్పీకర్ ఎన్నిక 3వ తేదీన జరుగుతుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జూన్ 5, 8, 9 తేదీల్లో చర్చ జరుగుతుంది. బడ్జెట్ ను జూలై 31వ తేదీ లోగా ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం ఉందని చిదంబరం చెప్పారు. మంత్రి వర్గ సమావేశానికి ముందు ప్రధాని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications