ప్రధానిగా మన్మోహన్ ప్రమాణం

ప్రణబ్ ముఖర్జీ, చిదంబరంలతో పాటు కాంగ్రెసుకు చెందిన ఎకె ఆంటోనీ, ఎస్ఎం కృష్ణ, గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, ఎస్ జైపాల్ రెడ్డి, కమల్ నాథ్, వాయలార్ రవి, మీరా కుమార్, మురళీ దేవరా, కపిల్ సిబాల్, అంబికా సోనీ, బికె హండిక్, ఆనంద్ శర్మ, సిపి జోషీ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు.
డిఎంకెతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేయలేకపోయారు. కొద్ది రోజుల్లోనే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ విస్తరణ సందర్భంగా సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ చార్జీతో జూనియర్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రి పదవులపై చర్చలను కొలిక్కి తీసుకు వచ్చేందుకు డిఎంకెతో చర్చలు జరపడానికి గులాం నబీ ఆజాద్ చెన్నై వెళ్తారు.












Click it and Unblock the Notifications