డిఎంకెతో విభేదాలు లేవు: ఆజాద్
న్యూఢిల్లీ: డిఎంకెతో తమకు ఎలాంటి విభేదాలు లేవని కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కాంగ్రెసుకు, డిఎంకెకు మధ్య మంత్రి పదవుల విషయంలో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందనే నేపథ్యంలో ఆయన శనివారం ఈ ప్రకటన చేశారు. డిఎంకె తమతోనే ఉందని ఆయన చెప్పారు.
తాను చెన్నై వెళ్లడం లేదని ఆయన చెప్పారు. మాటల మధ్య అర్థాలు వెతకాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 2004లో ప్రభుత్వంలో చేరడానికి డిఎంకె 9 రోజులు తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందే తమకు డిఎంకె మిత్ర పక్షమని, ప్రభుత్వ ఏర్పాటులో డిఎంకె ప్రధానమైన మిత్రపక్షమని ఆయన చెప్పారు. డిఎంకెతో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. వ్యక్తుల విషయంలో తమకు పరిమితులు లేవని, డిఎంకెతో మంత్రి పదవుల విషయంలో బేరసారాలు సాగడం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications