కడప: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శనివారం తన సొంత నియోజకవర్గం పులివెందులలో గడిపారు. ఆయన కుటుంబ సమేతంగా తన తండ్రి వైయస్ రాజారెడ్డి సమాధిని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆదివారం ఢిల్లీ వెళ్తారు. తన మంత్రి వర్గ జాబితాకు ఆయన ఆదివారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆమోద ముద్ర వేయించుకుంటారు. రేపు సాయంత్రమే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 25వ తేదీన తన మంత్రి వర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.