హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జెరూసలేం పర్యటన రేపు ఉదయానికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆరోగ్య శ్రీ వంటి ప్రభుత్వ పథకాల సమీక్ష తరువాత మధ్యాహ్నమే బయలు దేరాల్సింది. రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్ కు ఇది మొదటి విదేశీ పర్యటన. నాలుగు రోజులపాటు జెరూసలేంలోని పవిత్ర స్థలాను సిఎం సందర్శిస్తారు. వైఎస్ తో పాటు సెక్యూరిటీ ఆఫీసర్ రమేష్ రెడ్డి, ఇద్దరు అధికారులు కూడా వెళ్తున్నారు.