రాజకీయవాదిగా జూ.ఎన్టీఆర్: డివియస్
హైదరాబాద్: మహా నటుడు ఎన్టీరామారావు వారసుడిగా బాలకృష్ణ ముందుకు వచ్చారని తాను ఆనాడే చెప్పానని ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజు అన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు అవార్డును అందుకున్న ఆయన గురువారం మహానాడు వేదిక మీంచి మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సర్ గా అడుగు పెట్టి నటుడిగా ఎదిగారని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయవాదిగా ఎదిగారని ఆయన అన్నారు.
స్వర్గీయ ఎన్టీ రామారావుకు ఆత్మకు శాంతి కలిగే విధంగా పని చేయాలని ఆయన సూచించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాల్లో సింహాసనం అధిష్ఠించారు, రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ముళ్లపై నడవడం అని తాను స్వ్రర్గీయ ఎన్టీ రామారావుతో అన్నానని, రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీ రామారావుకు తాను సలహాలు ఇచ్చానే గాని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ మార్గంలో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
ఎన్టీఆర్ పురస్కారాలు అందుకున్న సి. నారాయణ రెడ్డి, గుమ్మడి వెంకటేశ్వరరావు, గీతాంజలి, గుమ్మడి గోపాల కృష్ణ కూడా మాట్లాడారు.












Click it and Unblock the Notifications